పీకే ప్యాకేజీ మాటలొద్దు – వైసీపీ
ఇదిగో ఏపీ అభివృద్ది గణాంకాలు
అమరావతి – ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐ ప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర స్థాయిలో మండి పడింది వైసీపీ . సోమవారం ట్విట్టర్ వేదికగా సీరియస్ గా స్పందించారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ గ్రాఫ్ పడి పోయిందని, ఆయన తిరిగి సీఎం అయ్యే ఛాన్స్ లేదంటూ అవాకులు చెవాకులు పేలడాన్ని తప్పు పట్టింది.
దమ్ముంటే అభివృద్దికి సంబంధించిన గణాంకాలు తమ వద్ద ఉన్నాయని, వాటి గురించి తెలుసుకుని మాట్లాడితే బావుండేదని పేర్కొంది. చంద్రబాబు నాయుడు నుంచి ఎంత ప్యాకేజీ తీసుకున్నావో తమకు తెలియదని, కానీ ఇలా గుడ్డిగా సపోర్ట్ చేయడం, ఆ తర్వాత తమ పార్టీపై బురద చల్లడం మంచి పద్దతి కాదని సూచించింది వైసీపీ.
ఈ దేశంలో సామాజిక న్యాయంతో పాటు సంక్షేమ పథకాలను కింది స్థాయి దాకా తీసుకు వెళ్లిన ఘనత ఒక్క సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని స్పష్టం చేసింది. ఇకనైనా ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీ మాటలు బంద్ చేసి వాస్తవ లోకంలోకి రావాలని కోరింది.