NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబు..ప‌వ‌న్ ఉమ్మ‌డి ప్ర‌చారం

Share it with your family & friends

దూకుడు పెంచ‌నున్న ఎన్డీయే కూట‌మి

అమరావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు , జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు సంయుక్తంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌ట్ట‌నున్నారు. ఈనెల 10, 11 తేదీల‌లో ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.

ప్ర‌చారంలో బాగంగా 10న త‌ణుకు, నిడ‌ద‌వోలు, 11న పి. గ‌న్న‌వ‌రం , అమలాపురంలో ప్ర‌చారం చేప‌ట్టునున్న‌ట్లు స‌మాచారం. ఇక చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఎలాగైనా స‌రే ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. విస్తృతంగా ప‌ర్యిటిస్తూ కేడ‌ర్ ల‌ను స‌మాయ‌త్తం చేస్తున్నారు.

మ‌రో వైపు ప్ర‌స్తుతం కొలువు తీరిన వైసీపీ జ‌గ‌న్ రెడ్డి పాల‌న ను ఏకి పారేస్తున్నారు చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. జ‌గ‌న్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ జ‌నం చెవుల్లో పూలు పెట్టాడ‌ని, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశాడంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇవాళ అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను కావాల‌ని ప‌ని చేయ‌కుండా చేశాడ‌ని, కానీ ఏమీ తెలియ‌న‌ట్టు ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.