జగన్ రెడ్డి చాప్టర్ క్లోజ్
ఎంపీ అభ్యర్థి బాల శౌరి
అమరావతి – ఎన్నికలయ్యాక జగన్ మోహన్ రెడ్డి ఇంటి బాట పట్టాల్సిందేనంటూ జోష్యం చెప్పారు జనసేన పార్టీ బందరు లోక్ సభ స్థానం అభ్యర్థి వల్లభనేని బాల శౌరి. అంతే కాదు వైసీపీ ఆఫీసుకు తాళం వేయడం తప్పదన్నారు. ప్రజలు జగన్ రెడ్డిని , ఆయన పరివారాన్ని త్వరగా తమ తమ ఇళ్లకు తరిమి వేయాలని కసితో ఉన్నారని జోష్యం చెప్పారు.
ఇక తన గెలుపునకు ఢోకా లేదన్నారు బాల శౌరి. మచిలీపట్నంలో బాల శౌరి సమక్షంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని కలలు కంటోందని కానీ దానికి అంత సీన్ లేదన్నారు.
ఇవాళ ఏ ఒక్క వర్గం ఆనందంగా లేదన్నారు. నవ రత్నాలు పేరుతో జనం చెవులలో పూలు పెట్టాడంటూ జగన్ మోహన్ రెడ్డిపై భగ్గుమన్నారు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాల శ!రి. జగన్ నినాదం వై నాట్ 175 అన్నది బక్వాస్ అంటూ ఎద్దేవా చేశారు. ఏ లెక్కన, ఏం చేశాడంటూ ఆయన పార్టీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. ప్రజలపై అప్పుల భారం మోపింది నువ్వు కాదా అంటూ సీఎంను ఉద్దేశించి ప్రసంగించారు.