శ్రీవారి సన్నిధిలో ఏపీ సీఎస్
దర్శించుకున్న జవహర్ రెడ్డి
తిరుమల – కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా వినుతి కెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలు కొలువైన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. అసలే వేసవి కాలం కావడంతో భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ సకల చర్యలు చేపడుతోంది.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి స్వామి వారిని బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి.
శ్రీనివాసుడిని దర్శించుకున్న అనంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను ఈవో ఎవి.ధర్మా రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం సీఎస్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా స్వామి, అమ్మ వార్లను దర్శించు కోవడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని తాను ప్రార్థించినట్లు తెలిపారు సీఎస్ జవహర్ రెడ్డి.