NEWSANDHRA PRADESH

ఇఫ్తార్ విందులో ఆర్కే రోజా

Share it with your family & friends

వెల్లి విరిసిన స‌మాన‌త్వం

పుత్తూరు – పుత్తూరు నియోజకవర్గం ఏర్పడిన తరువాత ముస్లింలకు ఇంతలా మంచి ఎప్పుడూ జరగలేదని పుత్తూరు పట్టణంలోని ముస్లిం సోదరులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన మంత్రి ఆర్కే రోజాకు, ఎంపీ ,రెడ్డప్పకు ఇఫ్తార్‌ విందును ఇచ్చారు.

పుత్తూరు మండలం వేపగుంట సమీపం జివిఆర్ కన్వెన్షన్ హాల్ తె ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. మంత్రిని, ఎంపీని ఆహ్వానించగా వారు విందులో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పవిత్ర రంజాన్‌ ప్రార్థనల్లో ముస్లీం సోద‌రుల‌కు రంజాన్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

మంత్రి ఆర్కే రోజాపై ఆప్యాయతానురాగాలు కురిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మత పెద్దలు మాట్లాడుతూ పుత్తూరు పట్టణంలో రూ. 3 కోట్ల వ్యయంతో అపురూపమైన షాదీఖానా, దర్గా మరమ్మతులు చేపట్టడంతో పాటు నియోజకవర్గంలోని మసీదుల నవీకరణకు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు.

మహానేత వైయస్సార్ రిజర్వేషన్లు కల్పించారన్నారు. అన్ని సంక్షేమ పథకాలు త‌మ‌కు వివక్ష లేకుండా అందుతున్నాయ‌ని చెప్పారు. ఎంతో సంతోషంగా రంజాన్‌ పండుగను జరుపుకుంటున్నామని అన్నారు. అల్లా దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటుందని దీవించారు.

మళ్లీ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఎమ్మెల్యేగా రోజమ్మ, ఎంపీగా రెడ్డెప్ప గెలవాలని దువా చేస్తున్నామన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ ముస్లిం సోదరులు తన పట్ల ఇంత ఆప్యాయతను చూపడం చెప్పలేని అనుభూతి ఇస్తోంద‌న్నారు.

. ఈ ప్రేమానురాగాలు తనపై ఎప్పుడు ఇలాగే ఉండాలన్నారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ముస్లీం సోదరులకు చేసినన్ని సేవలు ఏ నాయకుడు చెయ్యలేదన్నారు. ఈ పాలన ఇలాగే కొనసాగాలంటే తనను రెండవసారి, రోజమ్మను మూడవసారి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.