సజ్జల కామెంట్స్ షర్మిల సీరియస్
అధికార మదం తలకు ఎక్కిందా
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఆమె తనపై అనుచిత కామెంట్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ సంబోదించడాన్ని తప్పు పట్టారు. ఇది తన స్థాయికి తగదన్నారు. తమకు నోరుందని కానీ సంస్కారం అడ్డు వస్తోందన్నారు.
వైఎస్సార్ బిడ్డను పట్టుకొని ఇలాంటి మాటలు అంటావా అని నిప్పులు చెరిగారు. అధికార మదం తలకు ఎక్కిందా అని నిలదీశారు. మతి ఉండే మాట్లాడుతున్నావా అని ఫైర్ అయ్యారు. నువ్వు , నీ కొడుకు పేమెంట్ తీసుకొని నన్ను, సునీతను నానా రకాలుగా హింసించారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల.
మీ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వైఎస్ కు పుట్టలేదని విజయమ్మను అవమాన పరిచారని ఆరోపించారు. నువ్వు జగన్ రెడ్డికి సలహాదారుగా ఉండడం ఆయన చేసుకన్న కర్మ అన్నారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడతానంటే ఊరుకునేది లేదన్నారు.