బీజేపీ విరాళాల సంగతేంటి
ప్రశ్నించిన సంజయ్ సింగ్
న్యూఢిల్లీ – ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఏకంగా భారతీయ జనతా పార్టీకి రూ. 6,000 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాల్సిన అవసరం ప్రధాన మంత్రి మోదీపై ఉందన్నారు ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
గత ఏడు సంవత్సరాల కాలంలో ఏకంగా రూ. లక్ష కోట్లు నష్ట పోయిన కంపెనీలు 33కు పైగా ఉన్నాయని అన్నారు. ఈ కంపెనీలు గంప గుత్తగా బీజేపీకి రూ. 450 కోట్లు విరాళంగా ఇచ్చాయని ఆరోపించారు సంజయ్ సింగ్. వీరిలో 17 మంది పన్ను చెల్లించ లేదన్నారు. పన్నులో రాయితీ కూడా పొంద లేదని మండిపడ్డారు.
అంతే కాదు బీజేపీకి రూ. 600 కోట్లు విరాళంగా ఇచ్చిన వారు ఆరు మంది ఉన్నారని ఆరోపించారు సంజయ్ సింగ్. ఒకటి తన లాభం కంటే మూడు రెట్లు ఎక్కువ విరాళం ఇచ్చిన వ్యక్తి ఉన్నారని పేర్కొన్నారు.
ఇక తన లాభాల కంటే 93 రెట్లు విరాళంగా ఇచ్చిన కంపెనీ మరోటి ఉందన్నారు. ఇక మరో మూడు కంపెనీలు ఎన్నడూ ఆదాయపు పన్ను చెల్లించ లేదని ఆరోపించారు. కానీ బీజేపీకి రూ. 28 కోట్లు విరాళంగా ఇచ్చాయని ధ్వజమెత్తారు సంజయ్ సింగ్.