నేరస్థులకు ఆయనంటే హడల్
సీపీ శ్రీనివాస్ రెడ్డి చర్యలు
హైదరాబాద్ – అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు చేపట్టే వారికి, నేరస్థులకు ఇప్పుడు సింహ స్వప్నంలా తయారయ్యాడు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్ 24న ప్రజా భవన్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఖాకీలతో కుమ్మక్కై డ్రైవర్ ను మార్చేసి కేసును తారు మారు చేశారు. ఈ ఘటనలో కీలకమైన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ కు చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రహీల్ దుబాయ్ లో తల దాచుకున్నాడు. అక్కడ తన తండ్రి షకీల్ తో కలిసి ఓ ప్లాట్ లో ఉంటున్నాడు. రహీల్ కు సహకరించిన పంజాగుట్ట స్టేన్ మాజీ హౌస్ ఆఫీసర్ దుర్గారావు, బోధన్ సర్కిల్ మాజీ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ లను గుర్తించారు సీపీ. శాఖా పరమైన చర్యలతో ఆగలేదు. వారిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కూడా ప్రారంభించారు శ్రీనివాస్ రెడ్డి.
ఇదిలా ఉండగా పంజాగుట్ట మాజీ ఇన్ స్పెక్టర్ దుర్గారావును ఏపీలోని గుంత కల్ లో అరెస్ట్ చేశారు. న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే ప్రతి సందర్బంలోనూ ఆయన కఠినంగా ఉన్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంత కాలం ఎలా తప్పించుకుని ఉన్నాడనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.