శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లు
దర్శించుకున్న భక్తులు 61,920
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. భారీ ఎత్తున తరలి వస్తుండడంతో టీటీడీ ఏర్పాట్లు చేయడంపై ఫోకస్ పెట్టింది. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు స్పష్టం చేశారు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
పిల్లలకు పరీక్షలు ముగియడం, సెలవులు ఇవ్వడంతో భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. శ్రీనివాసుడు, అలివేలు మంగమ్మలను 61 వేల 920 మంది భక్తులు దర్శించుకున్నారు. 17 వేల 638 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిత్యం భక్తులు స్వామి వారికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
ప్రస్తుతం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.