అన్నామలైని గెలిపిస్తే అభివృద్ది
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి
తమిళనాడు – దమ్మున్న యువ నాయకుడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై అని కొనియాడారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు లోక్ సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇక్కడ అన్నామలై పోటీ చేస్తున్నాడని, అతడికి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు సింగ్. ఎందుకంటే తమ పార్టీలో ప్రధానంగా తమిళనాడులో యంగ్ బ్లడ్ కలిగిన అరుదైన నాయకుడు కె. అన్నామలై అని ప్రశంసలు కురిపించారు.
అన్నామలై తనకు సోదరుడి లాంటి వాడని, అతడు తప్పకుండా గెలుస్తాడని, తిరిగి తాను ఇక్కడికి వస్తానని ప్రకటించారు కేంద్ర మంత్రి. ప్రజలు సుస్థిరమైన పాలనను, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
కె. అన్నామలైని గెలిపిస్తే కోయంబత్తూరు అంతులేని అభివృద్దిని సాధించడం ఖాయమని స్పష్టం చేశారు హర్దీప్ సింగ్ పూరి.