NEWSTELANGANA

గ్యారెంటీల పేరుతో గార‌డీ

Share it with your family & friends

కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్క‌టే

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గార‌డీ చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా పార్ల‌మెంట‌రీ స్థాయి ముఖ్య నాయ‌కుల స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ఆయ‌న‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాద‌వ్ , గువ్వల బాల రాజు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా నిరంజ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టార‌ని, కాంగ్రెస్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ రెండూ ఒక్క‌టేన‌ని ఆరోపించారు. హామీల పేరుతో మోసం చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని పేర్కొన్నారు. ప్ర‌జల‌కు ఎలాంటి న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు.

ఈ సంద‌ర్బంగా నాగ‌ర్ క‌ర్నూల్ లోక్ స‌భ బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌సంగించారు. కాంగ్రెస్ , బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. హామీల పేరుతో కాంగ్రెస్ , కులం, మ‌తం పేరుతో రాజ‌కీయాలు చేయ‌డం కాషాయ పార్టీకి అల‌వాటుగా మారింద‌ని ఆరోపించారు.

మ‌రోసారి గెలిపిస్తే భారత రాజ్యాంగం ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లేన‌ని పేర్కొన్నారు. విద్వేషాలు రెచ్చ గొడుతూ ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు సృష్టించి ఓట్లు కొల్ల‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణ‌మ‌న్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.