వాపును చూసి బలుపనుకుంటే ఎలా
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్స్
నెల్లూరు జిల్లా – గారడీలు చేయడంలో దిట్ట టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు ఎంపీ విజయ సాయి రెడ్డి. వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని , పెంపుడు చిలుకలతో అనుకూల జోష్యం చెప్పించు కోవడంలో తనకు మించిన వ్యక్తి ఎవరూ లేరన్నారు. మంగళవారం ఎంపీ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు వాపును చూసుకుని బలుపు అనుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ప్రజలను మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కావాల్సినంత డబ్బులు అప్ప జెప్పడం, వారిని మ్యానేజ్ చేయడం, ఆ తర్వాత తాను గెలుస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారిందన్నారు.
వాపును చూసి బలుపు అనుకోవడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారిందన్నారు విజయ సాయి రెడ్డి. ప్రతి పౌరుడి చేతికి స్మార్ట్ ఫోన్ అనేది వచ్చాక ప్రజాభిప్రాయాలను మార్చడం అంత సులభం కాదని చంద్రబాబు అండ్ కంపెనీ గ్రహిస్తే మంచిదని స్పష్టం చేశారు ఎంపీ.