కేశినేని నాని లేఖపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్

అవ‌న్నీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లేన‌ని కామెంట్స్

అమరావతి : త‌న సోద‌రుడు మాజీ ఎంపీ కేశినేని నాని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాయ‌డం ప‌ట్ల స్పందించారు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని. ఆయ‌న మాజీ ఎంపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నిత్యం రగిలి పోతున్న‌డంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతూనే ఉన్నావని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌న సోద‌రుడు అని చెప్పుకునేందుకు సిగ్గు ప‌డుతున్నాన‌ని అన్నారు.

రేవులో తాడి చెట్టు మాదిరి పెరిగావు ఇంగిత జ్ఞానం మాత్రం లేదని ఫైర్ అయ్యారు ఎంపీ. ప్రధాని న‌రేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి , ఏపీ, తెలంగాణ రాష్ట్ర సీఎంలు నారా చంద్ర‌బాబు నాయుడు, ఎ. రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అయినా తాను ఎక్క‌డా సెంటు భూమి ఆక్ర‌మ‌ణ‌కు కాల్ప‌డ‌లేద‌ని పేర్కొన్నారు. మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌లో ఎలాంటి వాస్త‌వం లేద‌న్నారు. ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్, KA పాల్ మాత్రమేన‌ని పేర్కొన్నారు. నీ గురించి బెజ‌వాడ ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు.

  • Related Posts

    కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం

    అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం…

    హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్

    హైద‌రాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వ‌హించాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *