కార్య‌క‌ర్త‌లే జ‌న‌సేన పార్టీకి బ‌లం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీకి కార్య‌క‌ర్త‌లు ప‌ట్టుకొమ్మ‌ల‌ని, వారు లేకుంటే పార్టీకి మ‌నుగ‌డ లేద‌న్నారు. ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌ల కంటే నిబ‌ద్ద‌త‌తో పార్టీ కోసం ప‌ని చేసే వారే త‌న‌కు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.
మీలో ఉన్న అసలైన శక్తిని, నిబద్ధతను పార్టీ కోసం పూర్తిగా వినియోగించు కోవాలని అన్నారు. అందుకే ఈ బాధ్యతను వేరెవరికో వదలకుండా, నేనే స్వయంగా తీసుకున్నానని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గత 12 ఏళ్లుగా మీరంతా పార్టీ కోసం కష్టపడుతున్నా ఎలాంటి గుర్తింపున‌కు నోచుకోలేదని అన్నారు. అందుకే మీ అందరికీ సరైన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ 700 మందిని కమిటీల్లో స్థానం కల్పించాం అని చెప్పారు. ఇది కేవలం సమాచార సేకరణ కమిటీ మాత్రమే. క్షేత్రస్థాయి నుండి సరైన సమాచారాన్ని సేకరించడం మాత్రమే మీ బాధ్యత అని పేర్కొన్నారు.

మీ నియోజకవర్గాలు, పార్లమెంట్ల పరిధిలో ఎవరు నిజాయితీగా పని చేస్తున్నారు, ఎవరు చేయడం లేదనే విషయాన్ని పరిశీలకులకు స్పష్టంగా తెలియ జేయాలని అన్నారు. మిమ్మల్ని నేను చాలా నమ్మి ఈ స్థానాల్లో పెట్టాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పని చేయాలని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 28 మంది సభ్యులతో కూడిన ఒక బలమైన బృందం పని చేస్తుంద‌న్నారు. ఇందులో ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు ఉంటారు. వీరందరితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి 21 మంది సాధక్స్ ఉంటార‌ని తెలిపారు.

  • Related Posts

    విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంలో మరో ముందడుగు

    నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : నాగర్‌కర్నూల్ సర్కిల్ పరిధిలోని పెద్దముద్దునూరు 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రంలో 5 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (PTR) స్థానంలో 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన 8…

    ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి రాజీనామా

    చెన్నై : అన్నాడీఎంకే పార్టీ కి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు అప్స‌రా రెడ్డి. ఈ సంద‌ర్బంగా త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ చీఫ్ కు పంపించారు. ఆ లేఖ‌లో కీల‌క…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *