భగవంత్ మాన్ తో సింగ్ ములాఖత్
జైలులో ప్రశాంత జీవనం అనుభవించా
చండీగఢ్ – ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో భేటీ అయ్యారు. ఆయన ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఈడీ ఆయనను అదుపులోకి తీసుకుంది.
ఈ సందర్బంగా సీఎంతో భేటీ అయ్యారు కుటుంబంతో పాటు సంజయ్ సింగ్. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన సోదరుడితో కలవడం ఆనందంగా ఉందన్నారు. తనను జైలులో పెట్టవచ్చు కానీ తన ఆలోచనలను నియంత్రించ లేరంటూ పేర్కొన్నారు.
తాను జైలులో ఉన్నప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన సౌకర్యాలు కోరుకోలేదని స్పష్టం చేశారు. అయితే సాధారణ ఖైదీ లాగానే ఉన్నానని , గడిపానని చెప్పారు. తన బట్టలు తాను ఉతక్కున్నానని, పాత్రలు కూడా కడిగానని చెప్పారు.
ఒక రకంగా తాను గతంలో ఒరిస్సాలో పాత హాస్టల్ జీవితం తనకు గుర్తుకు వచ్చిందన్నారు ఎంపీ సంజయ్ సింగ్. ఆరు నూరైనా సరే తాను గెలుపొందడం ఖాయమన్నారు. దేశంలో మోదీ సర్కార్ కావాలని ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేశారని ఆరోపించారు.