తమిళ నాట బీజేపీ జోరు
బీజేపీ చీఫ్ కె. అన్నామలై
తమిళనాడు – రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించిన తర్వాత పార్టీకి భారీ ఆదరణ పెరిగిందని చెప్పారు. మంగళవారం కె. అన్నామలై మీడియాతో మాట్లాడారు.
మోదీ రోడ్ షోకు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. ఆయనను తమిళనాడు ప్రజలు తమ స్వంత సోదరుడిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రత్యేకించి చెన్నై నగర వాసులు నరేంద్ర మోదీని స్వంత కొడుకు లాగా చూసుకుంటున్నారని చెప్పారు కె. అన్నామలై.
బీజేపీ చేపట్టిన రోడ్ షోలు, సభలు, సమావేశాలకు భారీ ఎత్తున జనం ఆదరిస్తున్నరాని తెలిపారు. ప్రజలు బీజేపీని పవర్ లోకి తీసుకు రావాలని అనుకుంటున్నారని, డీఎంకే పనై పోయిందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఈ ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 400 కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలు లభిస్తాయని జోష్యం చెప్పారు కె. అన్నామలై.