31 లక్షల మంది పేదలకు ఇళ్లు
కట్టించిన ఘనత జగన్ రెడ్డిది
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడను ఏకి పారేశారు. టీడీపీ హయాంలో పేదలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.
ఏపీలో సొంత గూడు లేని 31 లక్షల మంది నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టించిన ఘనత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్ష లనుంచి రూ. 20 లక్షల దాకా సంపద సమకూర్చారని తెలిపారు.
రెండు లక్షల కోట్ల విలువైన 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మిన నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడిదని ఆరోపించారు విజయ సాయి రెడ్డి. తను స్థాపించిన హెరిటేజ్ సంస్థ బాగు పడటం కోసం చిత్తూరు డెయిరీని మూయించాడని ధ్వజమెత్తారు.
సంగం డెయిరీని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి ప్రజా ఆస్తుల దోపిడీకి పాల్పడ్డారంటూ మండిపడ్డారు వైసీపీ ఎంపీ. రాష్ట్రంలో పరిస్థితులు జగన్ రెడ్డి వచ్చాక మారి పోయాయని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన గొప్ప , అరుదైన నాయకుడు తమ పార్టీ చీఫ్ అని స్పష్టం చేశారు.