వైసీపీలోకి పోతిన మహేష్
కండువా కప్పుకోనున్న నేత
విజయవాడ – విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా టికెట్ ను ఆశించి భంగపడిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పోతిన మహేష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్బంగా పార్టీ వ్యవస్థాపకుడు , ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన సినీ రంగంలోనే నటుడు అని అనుకున్నానని కానీ రాజకీయాలలో కూడా సూపర్ గా నటిస్తున్నాడని తెలుసు కోలేక పోయానని వాపోయారు.
తాను ముందు నుంచి జనసేన పార్టీ కోసం పని చేశానని, బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించానని, ఆస్తులు అమ్ముకుని రోడ్డు పాలయ్యానని, టికెట్ ఇస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ చివరకు నిట్ట నిలువునా మోసం చేశాడని ఆరోపించారు పోతిన మహేష్. పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ వైసీపీ పార్టీ చీఫ్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
గత రెండు రోజుల కిందట ఆయన పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. దీంతో విజయవాడ వెస్ట్ నియోజవర్గంలో వైసీపీ అభ్యర్థికి బలం చేకూరనుందని పార్టీ భావిస్తోంది. మొత్తం మీద సుజనా చౌదరికి టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు పోతిన మహేష.