NEWSNATIONAL

ద‌ర్యాప్తు సంస్థ‌ల తీరు దారుణం

Share it with your family & friends

ఎంపీ సంజ‌య్ సింగ్ ఫైర్

న్యూఢిల్లీ – ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ఆరోపించారు. మోదీ, అమిత్ షా కనుస‌న్న‌ల‌లో న‌డుస్తున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీ, సీబీఐ లు ధారా సింగ్ , బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ మ‌ధ్య యుద్దంగా మారింద‌న్నారు. అదే స‌మ‌యంలో బీజేపీని విచారించే విష‌యానికి వ‌స్తే ఇవే ఏజెన్సీలు గ‌జ‌నీ మూడ్ లోకి వెళుతున్నాయ‌ని, త‌మ‌కు ఏవీ గుర్తుకు రావ‌డం లేదంటూ పేర్కొంటున్నాయ‌ని ఫైర్ అయ్యారు సంజ‌య్ సింగ్.

దేశంలో అత్య‌ధిక విరాళాలు భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ‌చ్చాయ‌ని, ఏకంగా రూ. 6,000 కోట్లు ఎలా ఇచ్చారో ఈ దేశ ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఎంపీ. అక్ర‌మాల‌కు, అవినీతికి , ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డిన కంపెనీలు, వ్య‌క్తులు, సంస్థ‌లు గంప గుత్త‌గా బీజేపీకి ఇచ్చాయ‌ని ఆరోపించారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ కు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు.