కేటీఆర్ నెట్టింట్లో వైరల్
అరుదైన ఫోటో షేర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాట్ టాపిక్ గా మారారు. ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా అరుదైన ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్బంగా కీలకమైన కామెంట్ కూడా చేశారు. దానికి ఓ అందమైన క్యాప్షన్ కూడా జత పరిచారు.
జీవితం అన్నది ఓ ప్రయాణమని,, కాలం ప్రతిసారి పరీక్ష పెడుతూనే ఉంటుందని , అయితే ఎదురయ్యే సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకూడదని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటే ఎంతటి కష్టాన్నైనా సులభంగా అధిగమించ వచ్చని తెలిపారు కేటీఆర్.
తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ పవర్ ను కోల్పోయింది. అయితే ఊహించని రీతిలో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడి పోయారు. గజ్వేల్ లో గెలుపొందిన ఆయన కామారెడ్డిలో చేతులెత్తేశారు.
ఇక తను పోటీ చేసిన సిరిసిల్ల నుంచి కేటీఆర్ విజయం సాధించారు. హరీశ్ రావు తన సీటు నిలబెట్టుకున్నారు. మొత్తంగా కేటీఆర్ షేర్ చేసిన ఈ ఫోటో గులాబీ నేతలు, అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.