లక్ష మంది ఐటీ నిపుణులకు ఉపాధి
ప్రకటించిన ఎంపీ విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో తమ సర్కార్ విద్య, ఉపాధి, వైద్యం, పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందని తెలిపారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తాను మరోసారి గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలోనే నెల్లూరు జిల్లాను నెంబర్ వన్ గా నిలబెట్టడమే తన ముందున్న లక్ష్యమన్నారు విజయ సాయిరెడ్డి. అంతే కాకుండా ప్రధానంగా ఐటీ పరంగా భారీ ఎత్తున నిపుణుల అవసరం ఉందన్నారు.
ప్రపంచ ఐటీ రంగంలో పోటీ పడేలా ఏకంగా లక్ష మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సాంకేతిక పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ , డిజిటల్ టెక్నాలజీ , క్లౌడ్ టెక్నాలజీ పై డిమాండ్ ఉంటోందన్నారు.
వీటిపై నైపుణ్యం కలిగిన సంస్థలు, వ్యక్తులతో తాము శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేలా చేస్తామని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి.