వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు
టీడీపీ..జనసేనకు బిగ్ షాక్
పల్నాడు జిల్లా – ఎన్నికల వేళ టీడీపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. అధికార పార్టీ వైసీపీలోకి వలసలు భారీగా పెరిగాయి. ఓ వైపు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. బుధవారం మేమంతా సిద్దం బస్సు యాత్ర చేపట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఇందులో భాగంగా పల్నాడు జిల్లా గంటావారి పాలెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం సమక్షంలో జనసేన, టీడీపీ పార్టీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పలువురు నేతలు. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు, కీలకమైన సీనియర్ నాయకులు ఉన్నారు.
పి. గన్నవరం జనసేన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ దేవి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ జగన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక రాయలసీమకు చెందిన రాయచోటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీకి.
తాను చంద్రబాబు వెంట ఉండలేనంటూ ప్రకటించారు. ఈ మేరకు పార్టీని వీడుతున్నానని తెలిపారు. ఆ వెంటనే జగన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పున్నారు. ఇదే సమయంలో విజయవాడ పశ్చిమ టికెట్ ఆశించి చివరి నిమిషం వరకు వెయిట్ చేసినా ఫలితం లేక పోవడంతో జనసేన పార్టీకి రాం రాం చెప్పారు పోతిన మహేస్.
ఆయన కూడా ఆ పార్టీని వీడి వైసీపీలోకి జంప్ అయ్యారు. మొత్తంగా టీడీపీ కూటమికి కోలుకోలేని షాక్ తగిలిందని చెప్పక తప్పదు.