సీఎంవా లేక చడ్డీ గ్యాంగ్ సభ్యుడివా
నిప్పులు చెరిగిన హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అనుచిత కామెంట్స్ పై భగ్గుమన్నారు. ఒక గౌరవ ప్రదమైన పోస్టులో ఉన్నానన్న సోయి లేకుండా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
మాజీ సీఎం కేసీఆర్ డ్రాయర్ ఊడ గొడతానని నిస్సిగ్గుగా మాట్లాడాడని , ఇదేనా నీ సంస్కృతి అని మండిపడ్డారు. అసలు నువ్వు ముఖ్యమంత్రివా లేక చడ్డీ గ్యాంగ్ సభ్యుడివా అంటూ నిలదీశారు తన్నీరు హరీశ్ రావు.
పాలన చేతకాక తమపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాడని, అధికారం ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని తన్నీరు హరీశ్ రావు హెచ్చరించారు. కేసీఆర్ ఎక్కడ నువ్వు ఎక్కడ అని అన్నారు.
దేశంలోనే రాదనుకున్న తెలంగాణను ఉద్యమం నిర్వహించి తీసుకు వచ్చిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు. నీకు అలాంటి చరిత్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయ్యావని , నీకు అంత సీన్ లేదన్నారు తన్నీరు హరీశ్ రావు. ఇకనైనా ముందు వెనుకా ఆలోచించి మాట్లాడాలని సూచించారు మాజీ మంత్రి.