బాబూ బురద చల్లడం మానుకో
ఎంపీ విజయ సాయి రెడ్డి ఫైర్
నెల్లూరు జిల్లా – చంద్రబాబు నాయుడు రోజు రోజుకు ఫ్రస్టేషన్ కు లోనవుతున్నాడని , టీడీపీ కూటమికి ఓటమి తప్పదని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విమర్శించడానికి మన దగ్గర ఆయుధాలేవీ లేనప్పుడు, బకెట్ల కొద్ది బురద చల్లాలి’ అనేది చంద్రబాబు అండ్ కంపెనీ సిద్దమై ఉందన్నారు. సూడో మేధావి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజూ ఎవరో ఒకరు తమపై నిరాధార ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
తాను ఢిల్లీలో ఉంటానని, ఇక్కడ ఉండనంటూ విమర్శలు గుప్పించడం దారుణమన్నారు. నెల్లూరు నా జన్మ భూమి అని, తాను పుట్టింది, చదువుకున్నది కూడా ఇక్కడేనని స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి. తల్లి నుంచి బిడ్డను వేరు చేసే నీచపు ప్రచారం ఇకనైనా మాను కోవాలని సూచించారు.
రాష్ట్రంలో అమలు జరిగిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచేలా చేసిన ఘనత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి.