DEVOTIONAL

ఘ‌నంగా కోదండ బ్ర‌హ్మోత్స‌వాలు

Share it with your family & friends

హనుమంత వాహనం శ్రీరాముడి తేజసం

తిరుప‌తి – తిరుపతిలోని శ్రీ కోదండ రామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాలలో భాగంగా ఆరవ రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు స్వామి వారు హనుమంత వాహనంపై అభయం ఇచ్చారు.

గజ రాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. త్రేతా యుగంలో రామ భక్తునిగా, భగవద్భక్తులలో అగ్ర గణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు.

అనంతరం ఉదయం 10.30 గంటల నుండి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రాముల వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనంలతో అభిషేకం చేశారు.

రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు గజ వాహనంపై రాముల వారు భక్తులకు కనువిందు చేయనున్నారు.