మేమొస్తే తమిళనాడుకు మహర్దశ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
వేలూరు – తాము అధికారంలోకి వస్తే తమిళనాడు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో వేలూరు నగరంలో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి దారి పొడవునా జనం సాదర స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తమిళనాడు వాసులు ఇన్నేళ్ల పాటు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కానీ తాము వచ్చాక భారీ ఎత్తున నిధులను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు నరేంద్ర మోదీ.
తమిళుల సంస్కృతి, నాగరికత అత్యంత పురాతనమైనదని పేర్కొన్నారు ప్రధాని. 143 కోట్ల మంది భారతీయులు మూకుమ్మడిగా సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు ప్రధానమంత్రి.
ఈసారి కూడా తమిళులు తమ వైపు ఉన్నారని, ఈ విషయం ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తే తెలుస్తుందన్నారు నరేంద్ర మోదీ. రాబోయే కాలం కాషాయానిదేనని స్పష్టం చేశారు.