రామోజీకి జైలు శిక్ష తప్పదు
ఉండవల్లి అరుణ్ కుమార్
అమరావతి – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్వ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మొదటి నుంచీ మీడియా ముసుగులో వ్యాపారవేత్తగా ఎదిగిన ఈనాడు సంస్థల యజమాని రామోజీ రావును టార్గెట్ చేశారు. సంచలన ఆరోపణలు చేశారు. మార్గదర్శి పేరుతో ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారంటూ , ఇది పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేశారు.
కేసులు కూడా వేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ పై తిరిగి రామోజీ రావు కేసు వేయడం కలకలం రేపింది. అయినా ఎక్కడా తాను తగ్గేదే లేదంటూ స్పష్టం చేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు రామోజీ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్బంగా రామోజీరావుపై సీరియస్ అయ్యింది. డిపాజిట్లు సేకరించడం పూర్తిగా నేరమేనని స్పష్టం చేసింది ధర్మాసనం. దీనిపై స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇలా సేకరించినందుకు గాను రామోజీరావుకు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆయన ఇటీవలే వైసీపీ కండువా కప్పుకున్నారు.