అన్నామలై ఓ ఊసరవెల్లి
డీఎంకే ఎంపీ దయానిధి మారన్
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలైపై నిప్పులు చెరిగారు డీఎంకే ఎంపీ దయానిధి మారన్. ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నామలై రోజుకు ఒక మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం కాదన్నారు.
కె. అన్నామలైని చూసి ఊసరవెల్లి సిగ్గు పడుతుందన్నారు దయానిధి మారన్. రోజు రోజుకు తన వైఖరిని మార్చుకుంటున్నాడని, తను మాట్లాడిన మాటలకే తాను కట్టుబడడం లేదని, ఇక ప్రజలకు ఎలా భరోసా కల్పిస్తాడంటూ ప్రశ్నించారు.
అన్నామలై మొదట నీట్ ను వ్యతిరేకించాడని, ఇప్పుడు నీట్ కు మద్దతు ఇస్తున్నాడని , తనకు హిందీ రాదని చెప్పాడని, ఇప్పుడు ఆ భాషలో అనర్ఘలంగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు దయానిధి మారన్.
ఊసరవెల్లిలా తన రంగులు మార్చుకుంటున్నాడని, జోకర్ లా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డాడు. తాము మాట ఇవ్వమని, ఇస్తే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. డీఎంకే దరిదాపుల్లోకి కూడా బీజేపీ రాలేదన్నారు. ఆ పార్టీకి అంత సీన్ లేదన్నారు. ఇండియా కూటమికి గెలుపు తప్పదన్నారు.