రైతులపై బాబుది కపట ప్రేమ
నిప్పులు చెరిగిన సీఎం జగన్ రెడ్డి
అమరావతి – నిన్నటి దాకా వ్యవసాయం దండుగ అన్న టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల వేళ ఓట్ల కోసం రైతులకు తాయిలాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
మేమంతా సిద్దం పేరుతో జగన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు భారీ ఎత్తున జనం ఆదరిస్తున్నారు. ఆయనకు జేజేలు పలుకుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ నేతను చూసేందుకు పోటీ పడుతున్నారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు జగన్ రెడ్డి.
చంద్రబాబు నాయుడుకు రైతులపై ప్రేమ అంటే ఎవరూ నమ్మరని అన్నారు. రుణ మాఫీ చేస్తానని ప్రకటించాడని కానీ ఇచ్చిన మాటకు కట్టుబడ లేదన్నారు ఏపీ సీఎం. తన పాలనలో ఏపీని సర్వ నాశనం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు జగన్ రెడ్డి.
ఇప్పుడు నీతి మాలిన రాజకీయాలకు కేరాఫ్ టీడీపీ కూటమి తయారైందని ధ్వజమెత్తారు. విలువలు లేని చంద్రబాబు ఇప్పుడు నీతి సూత్రాలు వల్లించడం దారుణం అన్నారు వైసీపీ చీఫ్.