ఏపీ జీవనాడి అమరావతి
అద్బుతంగా నిర్మిస్తాం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ ఎన్ సింగ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగించారు. ఈ దేశం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని మరోసారి ఎన్నిక కావాలని కోరుకుంటోందన్నారు. ప్రధానిగా కొలువు తీరాక ఏపీపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగిందని చెప్పారు.
నరేంద్ర మోదీ స్వ హస్లాలతో అమరావతి రాజధాని కోసం శంకుస్థాపన చేశారని, ఆ మాటకు తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు సిద్దార్త్ ఎన్ సింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ జీవనాడి అమరావతిలోనే ఉందన్నారు.
దేశంలోని ప్రధాన రాష్ట్రాల పరంగా చూస్తే దక్షిణాదిన అద్బుతమైన ప్రాంతం ఏపీ అని కొనియాడారు. వందల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర అభివృద్దికి కేటాయించడం జరిగిందని, ఈ ఘనత ఒకే ఒక్కరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు.
తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమ కూటమి పక్కాగా ఏపీలో గెలవడం ఖాయమని జోష్యం చప్పారు సిద్దార్థ్ ఎన్ సింగ్.