రాష్ట్రానికి డీఎంకే ఏం చేసింది..?
బీజేపీ చీఫ్ కె. అన్నామలై
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై నిప్పులు చెరిగారు. ఆయన డీఎంకేను టార్గెట్ చేశారు. ఆ పార్టీకి అంత సీన్ లేదన్నారు. ఈ దేశంలో అత్యంత నీచమైన పార్టీలలో ఎంకే స్టాలిన్ సారథ్యంలొని డీఎంకే పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ వేలూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా బిగ్ సక్సెస్ అయ్యింది.
మోదీ పర్యటన అనంతరం కె. అన్నామలై మీడియాతో మాట్లాడారు. రాజకీయాలను కలుషితం చేశారని ఆరోపించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో డీఎంకేకు కోలుకోలేని షాక్ తగలక తప్పదన్నారు. తమ పార్టీకి ఆశించిన దానికంటే ఎక్కువ ఎంపీ సీట్లు రాబోతున్నాయని స్పష్టం చేశారు.
యావత్ భారతమంతా ప్రత్యేకించి తమిళనాడు వాసులంతా నరేంద్ర మోదీని స్వంత సోదరుడిగా, కొడుకుగా భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గత 70 ఏళ్లుగా డీఎంకే ఏం చేసిందో రాష్ట్రానికి చెప్పాల్సిన బాధ్యత డీఎంకే బాస్ , సీఎం ఎంకే స్టాలన్ పై ఉందన్నారు.
అంతులేని అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మార్చాడంటూ ధ్వజమెత్తారు కె. అన్నామలై. ప్రాజెక్టులపై ఖర్చు చేయలేదని, ఇవాళ తాగు, సాగు నీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించు కోవడం లేదన్నారు బీజేపీ చీఫ్.