సీఎం ఇంటికి వెళ్లడం ఖాయం
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మూడిందని, ఆయనను ఇంటికి పంపించేందుకు జనం సిద్దమయ్యారని అన్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో తణుకులో భారీ బహిరంగ సభ చేపట్టారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.
అశేష జనవాహినిని చూస్తుంటే ఇక కూటమి అధికారంలోకి రావడం పక్కా అని తెలిసి పోయిందన్నారు. జాతీయ మీడియాతో పాటు పలు సర్వే సంస్థలన్నీ గంప గుత్తగా ఏపీలో టీడీపీ గాలి వీస్తోందని పేర్కొంటున్నాయని అన్నారు చంద్రబాబు నాయుడు.
ప్రజా మద్దతును చూస్తే జగన్ కు వణుకు పుట్టడం తప్పదన్నారు. తాము ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటర్లు అంటే తనకు గౌరవం ఉందని చెప్పారు. కానీ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు.
వై నాట్ 175 అన్నది ఇక జగన్ కు కలగానే మిగిలి పోనుందని అన్నారు. కూటమికి 170కి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందని జోష్యం చెప్పారు.