జగన్ ను నమ్మని జనం
కూటమిదే గెలుపు తథ్యం
అమరావతి – జగన్ అరాచక పాలనకు మూడిందన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. తీవ్ర అనారోగ్యం ఉన్నప్పటికీ ఆయన కూటమి పొత్తులో భాగంగా తణుకులో జరిగిన ప్రజా గళం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.
అన్ని వ్యవస్థలను నాశనం చేసింది కాక రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్. తాను ఆనాడు ఉద్దానంకు సంబంధించిన కిడ్నీ బాధితులను ఆదుకోవాలని కోరానని, ఆ వెంటనే సాయం చేశారని చంద్రబాబు నాయుడు గురించి కితాబు ఇచ్చారు.
రాష్ట్రం కోసం, నాలుగున్నర కోట్లకు పైగా ఉన్న ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం తాము పొత్తు పెట్టుకున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో వనరులన్నీ గంప గుత్తగా కొందరికే కట్టబెడుతున్న జగన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్న మైందని అన్నారు .
ప్రజలు మేలుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.