SPORTS

గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

Share it with your family & friends

రాజ‌స్థాన్ కు బిగ్ షాక్
జైపూర్ – మాన్ సింగ్ స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ 2024 లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ ఉత్కంఠ భ‌రిత విజ‌యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోర్ న‌మోదుచేసింది. యువ క్రికెట‌ర్ రియాన్ ప‌రాగ్ దంచి కొడితే శాంసన్ దుమ్ము రేపాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 196 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ధాటిగా ఆడింది. కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ క‌సి మీద ఆడాడు. అత‌డికి తోడు సాయి సుద‌ర్శ‌న్ నిలిచాడు. ఇద్ద‌రూ క‌లిసి రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఓ వైపు వికెట్లు కోల్పోయినా ఎక్క‌డా త‌డ‌బ‌డ లేదు .

శుభ్ మ‌న్ గిల్ 44 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 72 ర‌న్స్ చేశాడు. సాయి సుద‌ర్శ‌న్ 3 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 35 ప‌రుగులు చేశాడు. చివ‌రి ఓవ‌ర్ లో 15 ర‌న్స్ కావాల్సి వ‌చ్చింది. కానీ ర‌షీద్ ఖాన్ శాపంగా మారాడు. 11 బంతులు ఆడి 4 ఫోర్లతో 24 ర‌న్స్ చేశాడు. తెవాటియా 11 బంతులు ఆడి 3 ఫోర్ల‌తో 22 ప‌రుగుల‌తో గ‌ట్టెక్కించారు. ర‌షీద్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ద‌క్కింది.

మొత్తంగా రాజ‌స్థాన్ జైత్ర‌యాత్ర‌కు అడ్డుక‌ట్ట వేసింది గుజ‌రాత్ టైటాన్స్.