నవ్యాంధ్ర అభివృద్దికి డాక్యుమెంట్
100 రోజుల్లో అమలు చేస్తామన్న లోకేష్
అమరావతి – తాము పవర్ లోకి వచ్చిన 100 రోజుల్లోనే నవ్యాంధ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇదిలా ఉండగా ఏపీ అభివృద్ది కోసం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను కాన్ఫడరేషణ్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) ఏపీ చైర్మన్ డాక్టర్ వి. మురళీ కృష్ణ, వైస్ చైర్మన్ జి. మురళీకృష్ణల తో కూడిన బృందం నారా లోకేష్ ను కలుసుకుంది.
ఈ సందర్భంగా తయారు చేసిన డాక్యుమెంట్ ను నారా లోకేష్ కు అందజేసింది. ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోయే సర్కార్ కు మొదటి వంద రోజుల్లో ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై పూర్తి నివేదికను దశల వారీగా, అంశాల వారీగా పొందు పర్చింది ఇందులో.
ప్రధానంగా అభివృద్ధి, ఆదాయం పెంపు, ఉపాధి కల్పన వంటి కీలక అంశాలు ఈ విజన్ డాక్యుమెంటులో ఉన్నాయి. 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే విధంగా సృజనాత్మకమైన అంశాలు ఈ పాలసీలో పొందు పర్చడం విశేషం.
ఈ సందర్బంగా సీఐఐ చైర్మన్ ,వైస్ చైర్మన్ లను ప్రత్యేకంగా అభినందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు.