బాబూ దోచుకున్నది చాలదా
పార్టీ కోసం విరాళాలా
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మాటల తీవ్రత పెంచారు. ఆయన ప్రధానంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేశారు. టీడీపీ ఫర్ ఆంధ్రా పేరుతో కొత్తగా వెబ్ సైట్ ను లాంచ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు తమకు తోచిన రీతిలో విరాళాలు ఇవ్వాలని కోరారు.
దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుని , స్టేల మీద బతుకుతున్న బాబుకు ఇంకా ఏం కావాలని విరాళాలు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. వేల కోట్లు వెనకేసుకున్నాడని, తన రాజకీయ జీవితమంతా అబద్దాలు, మోసాలు, అక్రమాలు, అవినీతితోనే నడిచిందని ఆరోపించారు.
ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు తిరిగి మరో నాటకానికి తెర లేపాడని ధ్వజమెత్తారు విజయ సాయిరెడ్డి. లెక్కకు మించిన ఆస్తులను పోగేసుకున్న చంద్రబాబు విరాళాలు ఇవ్వండి అంటూ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు.