స్మితా..సానియా వైరల్
రంజాన్ వేడుకలలో హల్ చల్
హైదరాబాద్ – ఆ ఇద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. మరొకరు జగ మెరిగిన క్రీడాకారిణి. ఆమె ఎవరో కాదు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. స్మితా సబర్వాల్ , సానియా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.
రంజాన్ పర్వదినం పురస్కరించుకుని హైదరాబాద్ లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ , తనయుడు, కోడలు తో పాటు స్మితా సబర్వాల్ , ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా తనను ప్రత్యేకంగా పిలిచినందుకు తెగ సంతోషం వ్యక్తం చేశారు సీనియర్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. ఈ మేరకు సానియాతో చాలా సేపు వివిధ అంశాల గురించి ముట్చటించారు. ఇద్దరూ ఎవరికి వారే. ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా, మహిళా సాధికారతకు దర్పణంగా నిలిచారు.
వారి వారి రంగాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అనుకున్నది సాధించారు. చాలా రోజుల తర్వాత సానియాను కలుసు కోవడం తనకు సంతోషం కలిగించిందని ఈ సందర్బంగా స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ఆమె ఈ కార్యక్రమానికి సంబంధించి ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం వైరల్ గా మారాయి.