నరేంద్ర మోదీ తగ్గేదే లే
న్యూస్ వీక్ అన్ స్టాపబుల్
న్యూఢిల్లీ – భారత దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర దాస్ మోదీ మరోసారి సత్తా చాటనున్నారా. అవుననే అంటోంది ప్రముఖ జాతీయ స్థాయి మీడియా సంస్థ న్యూస్ వీక్. డానిష్ మంజూర్ భట్ ప్రత్యేకంగా ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. దీంతో అంతా తానే అయి ప్రచార బాధ్యతలు చేపట్టారు మోదీ. ఇవాళ ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమితో బీజేపీ తాడో పేడో తేల్చుకోనుంది.
ఇప్పటికే మోదీ సారథ్యంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో వై నాట్ 400 సీట్స్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మోదీకే పరివార్ అనే ట్యాగ్ లైన్ హల్ చల్ చేస్తోంది. ఇక ది న్యూస్ వీక్ లో తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకున్నారు మోదీ.
తాను 2024 ఎన్నికల గురించి ఆలోచించడం లేదని చెప్పారు. రాబోయే 2047 గురించి భారత దేశం భవిష్యత్తు ఎలా ఉండాలనే దానిపై ఫోకస్ పెట్టానని స్పష్టం చేశారు. ప్రధానంగా ఆయన రాహుల్ గాంధీని, ప్రతిపక్షాలను ప్రస్తావించారు. వారికి అభివృద్ది పట్టదని, కేవలం అడ్డుకోవడం మాత్రమే తెలుసన్నారు నరేంద్ర మోదీ.
మరోసారి బీజేపీ కూటమి దేశంలో జెండా ఎగుర వేయబోతోందని స్ఫష్టం చేశారు ప్రధాన మంత్రి. ప్రస్తుతం మోదీ ఇంటర్వ్యూ హల్ చల్ చేస్తోంది. భారత దేశాన్ని అమెరికాతో పోటీ పడేలా చేయడమే తన ముందున్న లక్ష్యమని ప్రకటించారు.