NEWSTELANGANA

బోగ‌స్ ఓట్ల‌తో ఓవైసీ గెలుపు ప‌క్కా

Share it with your family & friends

కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కామెంట్

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఫిరోజ్ ఖాన్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఓ వైపు త‌మ పార్టీ బేష‌ర‌తుగా ఎంఐఎంతో దోస్తీ చేస్తుంటే ఈయ‌న మాత్రం ఆ పార్టీ చీఫ్ , హైద‌రాబాద్ సిట్టింగ్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్నేళ్లుగా త‌ను ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేస్తూ వ‌చ్చారు. చాలా సార్లు దాడుల‌కు కూడా గుర‌య్యాడు. ఈసారి ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. కానీ మాట‌ల తూటాలు పేల్చుతున్నారు.

ఎంఐఎం వ‌ర్సెస్ ఫిరోజ్ ఖాన్ గా మారి పోయిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆయ‌న చేసిన తాజా వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఓవైసీతో ఈ సారి ఎన్నిక‌ల్లో కూడా పోరాటం కొన‌సాగుతూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. తాను నిజాయితీగా ఉండాల‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని అన్నారు.

ప్ర‌స్తుతం త‌మ పార్టీ ఓవైసీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరింద‌న్నారు. అయితే ఓవైసీ ఎలాగైనా స‌రే బోగ‌స్ ఓట్ల‌తో గెల‌వ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. మే 13 వ‌ర‌కు చేస్తాన‌ని , ఆ త‌ర్వాత తాను పున‌రాలోచిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు ఫిరోజ్ ఖాన్.