కాంగ్రెస్ లో భారీగా చేరికలు
ఆహ్వానించిన సీఎం రేవంత్
హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు భారీగా నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే గతంలో అధికారాన్ని చెలాయించిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ హోదాలకు చెందిన నేతలు మూకుమ్మడిగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండడంతో ఈ వలసల సంఖ్య భారీగా పెరిగింది. తాజాగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ , తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరారు. వారందరీకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందిన జంపన ప్రతాప్ సైతం కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.