గెలుస్తా ఓవైసీని ఇంటికి పంపిస్తా
బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత
హైదరాబాద్ – హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను ఎంపీగా గెలుస్తానని, ఇక ఇన్నాళ్లుగా చిల్లర రాజకీయాలు చేస్తూ వచ్చిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు.
రంజాన్ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగిందని తెలిపారు మాధవీలత. ఈసారి గెలవడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు తనను గెలిపించాలని మనసారా కోరుకుంటున్నారని అన్నారు .
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. భారీ ఎత్తున బోగస్ ఓట్లు ఉన్నాయని ఇంత కాలం వాటి మీద ఆధారపడి గెలుస్తూ వచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాధవీ లత అసదుద్దీన్ ఓవైసీపై. ఇకనైనా ఇలాంటి చవకబారు రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.
దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని కానీ మాయ మాటలతో , అభివృద్ది అన్నది లేకుండా ఎంపీగా ఇంత కాలం హైదరాబాద్ కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మాధవీ లత.