మార్గదర్శి పేరుతో రామోజీ దందా
నిప్పులు చెరిగిన సజ్జల రామకృష్ణా రెడ్డి
తాడేపల్లిగూడెం – రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిప్పులు చెరిగారు. మార్గదర్శి స్కాంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను మోసం చేసిన బాగోతం నిజమేనని తేలిందన్నారు.
అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారని ఆరోపించారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మీడియా పేరుతో అడ్డగోలు వ్యాపారాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించారని ధ్వజమెత్తారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలతో రామోజీరావు అసలు బండారం బట్టబయలు అయ్యిందన్నారు. ఆర్బీఐ రూల్స్ కు విరుద్దంగా ఆయన చేసిన వ్యాపారం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడును గద్దెను ఎక్కించడం కోసం పడరాని పాట్లు పడుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డిపై విషం కక్కుతున్నారని పేర్కొన్నారు.
అందరినీ నీతులు బోదించి, సుద్దులు చెప్పే రామోజీ రావు తన వరకు వచ్చేసరికి అవి పాటించడని ఆరోపించారు.