జాబ్స్ పేరుతో జగన్..బాబు దగా
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా న్యాయ యాత్రలో భాగంగా చేపట్టిన బస్సు యాత్ర సందర్బంగా ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము పవర్ లోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించారంటూ చంద్రబాబు , జగన్ మోహన్ రెడ్డిలను ఏకి పారేశారు. ఒకరేమో జాబు కావాలంటే బాబు రావాలని టీడీపీ పిలుపునిచ్చిందని చెవుల్లో పూలు పెట్టిందని అన్నారు.
ఏపీని అప్పుల కుప్పగా మార్చేశాడంటూ బాబు ఆనాటి పాలనపై మండిపడ్డారు వైఎస్ షర్మిల. ఇక వైఎస్సార్ వారసుడినంటూ పదే పదే చెప్పుకుంటూ వచ్చిన ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు వైఎస్ షర్మిల.
ఇక ఏపీలో యువతకు , నిరుద్యోగులకు జాబు రావాలంటే జగన్ రెడ్డి కావాలంటూ మరో ఘరానా మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇది దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. ఇప్పటి వరకు కనీసం 10 వేలకు పైగా పోస్టులను నింప లేక పోయారంటూ మండిపడ్డారు.
ఇకనైనా ఏపీ సీఎం ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.