మోదీకి మెగాస్టార్ కితాబు
కళాకారులకు గౌరవం భేష్
హైదరాబాద్ – మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాటను ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కళాకారులను గౌరవించడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ ప్రశంసల జల్లులు కురిపించారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రధానికి, భారతీయ జనతా పార్టకి, ఎన్డీలోని భాగస్వామ్య పార్టీలకు ఒకింత మేలు చేకూర్చేలా ఉన్నాయి.
కళాకారులను గౌరవించడంలో ఎల్లప్పుడూ మోదీ ముందంజలో ఉంటారని ప్రశంసించారు. మోదీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావడం మనందరికీ గర్వ కారణం అంటూ పేర్కొన్నారు చిరంజీవి. ఇదిలా ఉండగా మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ ఆసక్తిని రేపాయి.
ప్రస్తుతం మెగాస్టార్ ఫ్యామిలీ ఇటీవల అయోధ్య రామ మందిరంలో ప్రత్యక్షం అయ్యారు. గతంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. కేంద్ర సహాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమాల్లో బిజీగా మారారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు.