అన్నామలై గెలుపు అభివృద్దికి మలుపు
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో
తమిళనాడు – ఈ దేశంలో అత్యంత జనాదరణ, శక్తివంతమైన యువ నాయకులలో తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై కుప్పు స్వామి ఒకరని కితాబు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయేలో భాగస్వామిగా చేరిన టీడీపీ తరపున లోకేష్ ఇవాళ తమిళనాడులో ప్రచారం చేపట్టారు.
ఆయన కోయంబత్తూరులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక్కడ అత్యధిక ఓట్లు తెలుగువారికి చెందినవి ఉన్నాయి. దీంతో వారందరినీ అన్నామలైకి ఓటు వేసేలా చేసేందుకు గాను ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్బంగా నారా లోకేష్ , కె. అన్నామలై రోడ్ షోకు ఊహించని రీతిలో స్పందన లభించింది.
ప్రధానంగా పీలమేడులో ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. అద్భుతమైన రోడ్ షోను చూసి బీజేపీ అభ్యర్థి కె. అన్నామలై సంతోషానికి లోనయ్యారు. తమిళనాడులో మార్పు రాబోతోందన్నారు. తమిళులు, తెలుగు వారంతా ఒక్కటేనని చెప్పారు నారా లోకేష్. ఇక్కడ కె. అన్నామలై కుప్పుస్వామి గెలవడం ఖాయమన్నారు. ఆయన గెలుపుతో కోయంబత్తూరు అన్ని రంగాలలో అభివృద్ది జరుగుతుందన్నారు నారా లోకేష్.