అన్నామలైకి మద్దతు ఇవ్వండి
తెలుగు వారికి విన్నవించిన లోకేష్
తమిళనాడు – తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తెలుగు వారందరూ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి, ఎన్డీయే కూటమికి బేషరతుగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర చీఫ్ కె. అన్నామలై కుప్పుస్వామి బరిలో నిలిచిన కోయంబత్తూర్ లో పర్యటించారు.
ఈ సందర్బంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగు వారిని కలిశారు. మీరంతా అద్భుతమైన విజన్ కలిగిన, యువ నాయకుడైన కె. అన్నామలైకి ఓటు వేయాలని కోరారు. ఎందుకంటే ఇక్కడ అన్నామలై గెలిస్తే అన్ని రంగాలలో అభివృద్దికి ఈ ప్రాంతం నోచుకుంటుందన్నారు నారా లోకేష్.
కోయంబత్తూరులో స్థిర పడిన తెలుగు వారితో ఇవాళ కలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు నారా లోకేష్. వారితో కీలక అంశాలపై చర్చించారు. కె. అన్నామలైతో పాటు కర్ణాటకకు చెందిన యువ నాయకుడు తేజస్వి సూర్యతో కలిసి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు లాగానే నరేంద్ర మోదీ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసలు కురిపించారు. అందుకే తాము కలిసి పోటీ చేస్తున్నామని చెప్పారు నారా లోకేష్.