ఏపీలో 18న ఎన్నికల నోటిఫికేషన్
ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి
అమరావతి – రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ మీనా.
ఏప్రీల్ 19వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి 7 విడతలుగా నిర్వహించనుంది సీఈసీ.
ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు ముకేష్ కుమార్ మీనా. ఏప్రిల్ 26న దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు.
ఇదిలా ఉండగా మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు సీఇఓ. నెల్లూరు జిల్లాలో పర్యటించిన సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.