సిద్దిపేట‌లో క్యాన్స‌ర్ మందుల త‌యారీ కేంద్రం

సంగారెడ్డి జిల్లా : సిద్దిపేటలో క్యాన్సర్ మందుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు. ఈ కేంద్రం అంతర్జాతీయ ఔషధ నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మందులు , సాఫ్ట్ జెల్స్‌ను తయారు చేస్తుంది. సోమవారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇత‌ర ఉన్న‌తాదికారులు హాజ‌రయ్యారు. భారతదేశపు ‘ఫార్మా రాజధాని’గా అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణలో మరో భారీ ఔషధ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. సిద్దిపేట జిల్లా కరకపట్లలోని బయోటెక్ పార్క్-3లో, క్యాన్సర్ మందుల తయారీ సంస్థ అయిన ‘సిరో ఫార్మా’ (CIRO Pharma) నిర్మించిన అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు శ్రీ‌ధ‌ర్ బాబు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ తయారయ్యే క్యాన్సర్ మందులను ప్రధానంగా అమెరికా, ఐరోపా, లాటిన్ అమెరికా , గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 275 మంది సిబ్బంది పనిచేస్తుండగా, పూర్తి స్థాయి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఉద్యోగులు , శాస్త్రవేత్తల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. ఫార్మా ప‌రిశ్ర‌మ‌లు పెద్ద ఎత్తున తెలంగాణ‌లో ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు శ్రీ‌ధ‌ర్ బాబు.

  • Related Posts

    గ్లోబ‌ల్ నాలెడ్జ్ హ‌బ్ గా హైద‌రాబాద్ : సీఎం

    లండన్ : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో అత్యంత ఫలప్రదమైన, ఆసక్తికరమైన సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, అంతే కాకుండా ప్రపంచ స్థాయి ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’…

    కేపీఎస్సీ ఛైర్మన్‌పై చర్యలకు కర్ణాటక కేబినెట్ సిఫార్సు

    బెంగ‌ళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) ఛైర్మన్ శివశంకరప్ప సహుకర్‌పై శిక్షాత్మక చర్యలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ కర్ణాటక కేబినెట్ తీర్మానించింది. సహుకర్‌కు సంబంధించిన ఆయన నివాసం, కార్యాలయంతో సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *