చంద్రుడి పైకి వ్యోమగాములు
ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి
బెంగళూరు – ఇస్రో చైర్మన్ సోమనాథ్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే పలు ప్రయోగాలతో యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేస్తున్నారు తన సారథ్యంలో. ఇవాళ భారత్ ఏం చేస్తుందనే దానిపై ఇతర దేశాలు ఫోకస్ పెట్టాయి.
ఇప్పటికే చంద్రుడిపైకి ఉప్రగ్రహాలను పంపించి సక్సెస్ అయ్యింది. ఇదిలా ఉండగా ఇదే అంశానికి సంబంధించి ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వచ్చే 2040 నాటికి చంద్రడి పైకి వ్యోమగాములను పంపించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. జాబిల్లి రహస్యాలను తెలుసుకుంటారని తెలిపారు. దీని కోసం శ్రీహరి కోట లోని షార్ లో మూడో ప్రయోగ వేదికను నిర్మిస్తామని చెప్పారు ఇస్రో చైర్మన్.
2028లో చంద్రయాన్-4ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భవిష్యత్తు ప్రయోగాల కోసం టెక్నాలజీని మెరుగు పరుచు కుంటున్నామని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఇస్రో మరింత ముందుకు వెళ్లేందుకు కావాల్సిన నైతిక మద్దతును కోరుతున్నట్లు చెప్పారు.