NEWSANDHRA PRADESH

క్షోభిస్తున్న వైఎస్..వివేకా ఆత్మ‌లు

Share it with your family & friends

వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్

క‌డ‌ప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఆమెతో పాటు సోద‌రి డాక్ట‌ర్ సునీతా రెడ్డి కూడా పాల్గొన్నారు. న్యాయం ఒక వైపు అధ‌ర్మం ఇంకో వైపు ఉంద‌న్నారు. ధ‌ర్మ పోరాటం ఒక వైపు డ‌బ్బు, అధికారం మ‌రో వైపు ఉంద‌న్నారు.

న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా ? ల‌ఏక‌ హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తరా అంటూ ప్ర‌జ‌ల‌ను నిల‌దీశారు. ప్ర‌స్తుతం మీరంతా తీర్పు చెప్పే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. జ‌గ‌న్ రెడ్డి నిర్వాకం, పాల‌నను చూసి దివంగ‌త త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, త‌న చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిల ఆత్మ‌లు క్షోభిస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

స్వ‌యంగా చిన్నాన్న‌ను దారుణంగా హ‌త్య చేశార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌ర్ లో ఉన్న జ‌గ‌న్ రెడ్డి ఒక్క‌రిని కూడా ప‌ట్టుకోలేక పోయాడ‌ని మండిప‌డ్డారు. విచిత్రం ఏమిటంటే కాపాడాల్సిన వాడు ఉన్న‌ట్టుండి హంత‌కుడికి మ‌ద్ద‌తు ఇస్తున్నాడ‌ని ఇది దేశ చ‌రిత్ర‌లో ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్నారు. హంత‌కుల‌ను కాపాడుతున్న సీఎంకు త‌గిన రీతిలో బుద్ది చెప్పాల‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌.